Header Banner

నిరుద్యోగులకు శుభవార్త! ఈనెల 20న మెగా జాబ్ మేళా! కావలసిన అర్హతలు ఇవే!

  Tue Feb 18, 2025 08:29        Employment

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహిస్తుంది. ప్రతి యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని అక్కడికి వచ్చే కంపెనీలతో ఇంటర్వ్యూలో పాల్గొంటే వారి చదువు తగ్గట్లు ఉద్యోగం పొందవచ్చు. దీనిలో భాగంగానే విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్లో ఫిబ్రవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా సబ్ రీజినల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్.శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. విప్రో సొల్యూషన్, అస్ట్రోటెక్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, MBA, MCA ఉత్తీర్ణత సాధించి 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. 18-35 సం., మధ్య వయసు ఉండాలని తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 

 

విద్యా అర్హత పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఆపై చదువు పూర్తిచేసి ఉండాలి అని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూకు బయోడేటా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి ఎన్.శ్యాంసుందర్ తెలిపారు. మరిన్ని వివరాలకు www.naipunyam.ap.gov.in వెబ్సైటు లేదా 6304634447, 9398338105 నెంబర్ లను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. నిరుద్యోగ యువత అవకాశం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయం అని తెలియజేశారు. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అని తెలియజేశారు. విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకుంటారు అని తెలియజేశారు. ఎప్పటికప్పుడు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పన చేస్తామని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Employment #Jobs #JobMela #India #AndhraPradesh #Visakhapatnam